Pulivendula: పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీ ఎన్నికలు ముగిశాయి. క్యూలైన్‌లో ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇచ్చారు. భారీ భద్రత మధ్య బ్యాలెట్ బాక్స్‌లు కడపకు తరలించనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాదన నేపథ్యంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చారు.