Nimmala Ramanaidu: 2026 మే నెల చివరి వరకు 28,946 మందికి రూ. 900 కోట్లతో పునరావాసం కల్పిస్తామని ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. 2027 మార్చి వరకు పోలవరం నిర్వాసితులను పునరావాసం పూర్తి చేస్తామని తెలిపారు. పడకేసిన పోలవరం పనులను కార్యరూపం దాల్చేలా పనిచేస్తున్నామన్నారు. తాజాగా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌తో భేటీ అయ్యారు.