సంక్రాంతి టైంలో... గోదావరి జిల్లాల్లో... కోడి పందేలు ఎంత ఫేమస్సో... పేకాట శిబిరాలు కూడా అంతే పాపులర్. ఆ మూడు రోజులు కూర్చున్న దగ్గర్నుంచి లేవకుండా ఆడే పేకాట రాయుళ్ళు ఉంటారంటే అతిశయోక్తి కాదు. దాన్ని సరదా అని వాళ్ళంటారు. జూదమని బయటి వాళ్లంటారు. సరే... ఎవరేమనుకున్నా... అదంతా అంతవరకే. పండగ ముచ్చట ముగిశాక అలాంటివి ఉండవు కాబట్టి పోలీసులు కూడా చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ... ఇప్పుడు పరిస్థితి మారుతోందట.