ప్రముఖ విద్యావేత్త, కవి, ఇంజనీర్ డా. వి.మాలకొండారెడ్డి ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయనను ఉండేల మాలకొండారెడ్డి అంటేనే అంతా గుర్తుపడతారు. చిన్న తనం నుంచే ఆయన కవిత్వం చెప్పేవారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి పొందారు. మాలకొండారెడ్డి 1932 ఆగస్టు 23 న ప్రకాశం జిల్లా లోని ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు. అల్లూరు, నెల్లూరులలో పాఠశాల చదువు ముగించి మద్రాసు గిండీ ఇంజనీరింగు కళాశాలలో బీఈ డిగ్రీ పూర్తిచేశారు. ఎడిన్‌బరో యూనివర్శిటీ (బ్రిటన్) నుండి…
(ఆగస్టు 18న గుల్జార్ పుట్టినరోజు) సంస్కృత ప్రభావం నుండి తెలుగు భాష తప్పించుకోలేనట్టే, ఉర్దూ పదాలు లేకుండా హిందీ శోభించదు. ఈ విషయం తెలిసిన వారు ఉర్దూను అందంగా, హిందీ సాహిత్యంలో చొప్పించేవారు. అలా ఎందరో హిందీ చిత్ర గీతరచయితలు సాగారు. వారిలో గుల్జార్ బాణీ ప్రత్యేకమైనది. కేవలం పాటలతోనే కాదు, మాటలతోనూ మురిపించిన ఘనుడు గుల్జార్. కథకునిగానూ కట్టపడేశారు. దర్శకత్వంతోనూ మురిపించారు. అంతలా అలరించిన గుల్జార్ అసలు పేరు సంపూరణ్ సింగ్ కల్రా. గుల్జార్ అన్నది…
కవితకు కాదేది అనర్హం అన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఒకప్పుడు కవిత చెప్పాలి అనే, పద్యం రాయాలి అంటే తెలుగు వ్యాకరణం ఆమూలాగ్రం తెలిసి ఉండాలి. సంస్కృతంపై మంచి పట్టు ఉండాలి. పండితుల భాషలో చెప్పగలగాలి. శ్రీశ్రీ వచ్చిన తరువాత కవితకు అర్ధం మార్చేశారు. అలతి పదాలతో అనర్గళమైన అర్ధాన్ని ఇచ్చే విధంగా కవితలు రాశారు. పదునైన పదాలతో సూటిగా ప్రశ్నించాడు. వస్తే రాని పొతే పోనీ అని అంటూ అప్పటికి ఇప్పటికి ఎప్పటికి వచ్చే కష్టాలను, సుఖాలను పట్టించుకోవద్దని చెప్పాడు. 18 ఏళ్ల…