PM Narendra Modi visit to Morbi today: మోర్బీ వంతెన కూలిన ఘటన యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 141 మంది మరణించారు. సమయం గడుస్తున్నా కొద్ధీ మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉండటం అందర్ని కలిచివేస్తోంది. ఇదిలా ఉంటే ఈ రోజు(మంగళవారం) ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నారు ప్రధాని నరేంద్రమోదీ. అక్కడే ముఖ్యమంత్రి, అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించనున్నారు. చికిత్స పొందుతున్న…