PM Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ‘అభివృద్ధి చెందిన భారత్, అభివృద్ధి చెందిన జమ్మూ కాశ్మీర్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన బక్షి స్టేడియానికి చేరుకున్నారు. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రపాలిత ప్రాంతానికి ప్రధానమంత్రి సుమారు రూ. 5,000 కోట్ల బహుమతిని ఇవ్వనున్నారు.