PM Narendra Modi to visit Ayodhya on Diwali eve: ప్రధాని నరేంద్ర మోదీ వరసగా దేవాలయాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్, బద్రీనాథ్ సందర్శించిన ఆయన ఆదివారం అయోధ్య పర్యటనకు వెళ్లనున్నారు. నిర్మాణంలో ఉన్న రామజన్మభూమి ఆలయంలో శ్రీరాముడిని దర్శించుకోనున్నారు. ఆ తరువాత అయోధ్యలో జరిగే దీపోత్సవ కార్యక్రమానికి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, మోదీ వెంట ఉండనున్నారు. రామాలయ నిర్మాణం గురించి ప్రధాని మోదీకి, యోగి…