ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ ఈ నెల 18న శతవసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరగనున్న ఆమె పుట్టిన రోజు వేడుకల్లో మోదీ కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా వాద్‌నగర్‌లోని హటకేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పావగఢ్‌లోని కాళీమాత ఆలయంలో జరిగే పూజల్లోనూ మోదీ పాల్గొంటారు. తల్లి శత వసంత పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని గాంధీనగర్‌లోని రైసన్ పెట్రోల్ పంపు నుంచి 60 మీటర్ల రోడ్డుకు ‘పూజ్య హీరా మార్గ్’ అని నామకరణం…