పహల్గామ్ ఉగ్రవాదులకు ఊహించని విధంగా శిక్షలు విధిస్తామని ప్రధాని మోడీ అన్నారు. పహల్గామ్ దాడి తర్వాత తొలిసారి బీహార్‌లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గామ్ మృతుల కోసం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ గురువారం పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బీహార్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగిస్తూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.