ఆదివారం నాడు చెన్నై నగరంలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైలు.. పట్టాలు తప్పి ఏకంగా మీటరు ఎత్తున్న ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ప్లాట్‌ఫారం ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని బీచ్ స్టేషన్‌లో సబర్బన్ రైలు పట్టాలు తప్పింది. షెడ్ నుంచి స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. అయితే ఈ రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వైపు…