హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భోలక్‌పూర్‌లోని స్క్రాప్ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. జనావాసాల మధ్య గోడౌన్ ఉండడంతో.. ఆందోళన నెలకొంది. మంటలు పెద్ద ఎత్తున్న ఎగిసి పడుతున్నాయి. గోడౌన్ చిన్న గల్లీలో ఉండడంతో మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్‌లు వెళ్లేందుకు చోటు లేక ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రమాద స్థలానికి 3 ఫైర్ ఇంజన్‌లను అధికారులు పంపారు. మంటలు ఎగిసిపడుతుండడంతో.. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే..…