కెన్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున క్యాలే కౌంటీలోని డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తున్న తేలికపాటి విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. పర్యాటకులతో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. టూరిస్టుల సహా 12 మంది మృతి చెందారు.
లండన్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం జరిగింది. విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం కూలిపోయింది. దీంతో వెంటనే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయుడి సహా 20 మంది చనిపోయారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు చమురు క్షేత్రం సమీపంలో టేకాఫ్ అవుతుండగా విమానం కూలిపోయింది.
డిసెంబర్ 2024 విమాన ప్రయాణీకులకు 'బ్లాక్ నెల'గా మారింది. ఈ నెలలో ప్రపంచవ్యాప్తంగా 6 విమాన ప్రమాదాలు జరిగాయి. 233 మంది మరణించారు. ఈ గణాంకాలు నిజంగా భయానకంగా మారాయి. ఈ ప్రమాదాలు విమాన ప్రయాణ సమయంలో భద్రత గురించి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. దక్షిణ కొరియాలోని . ముయాన్ విమానాశ్రయంలో ఆదివారం విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పింది.
అమెరికాలో విమాన ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని విక్టోరియా హైవేపై విమానం కూలిపోయింది. పలు కార్లను ఢీకొట్టి ముక్కలైపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితులను చక్కదిద్దారు.
ఫ్రాన్స్‌లో జరిగిన ఎయిర్‌షోలో అపశృతి చోటుచేసుకుంది. 65 ఏళ్ల పైలట్ విమానంతో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ సంవత్సరం కనీసం 2,694 విమానాలకు సంబంధించిన సంఘటనలు నమోదయ్యాయి. ఈ ఘటనల కారణంగా ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 697 మంది చనిపోయారు. ASN ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రమాదాలు.. భద్రతా సమస్యలపై సమాచారాన్ని అందజేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 23న మలేషియా నౌకాదళానికి చెందిన రెండు విమానాలు (యూరోకాప్టర్ AS 555SN ఫెన్నెక్ M502-6 మరియు అగస్టావెస్ట్‌ల్యాండ్ AW139 M503-3) ప్రమాదానికి గురయ్యాయి.
Florida Plane Crash: ఫ్లోరిడా నుంచి హృదయ విదారకమైన వార్త ఒకటి వెలువడుతోంది. శుక్రవారం (9 ఫిబ్రవరి 2024) ఒక ప్రైవేట్ విమానం హైవేపై ఘోరంగా కూలిపోయింది. దీంతో ఇద్దరు చనిపోయారు.
passenger jet collides with truck on runway in Peru: లాటిన్ అమెరికా దేశం పెరూలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం రన్ వే పైన ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా విమానాన్ని మంటలు చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారు. పెరూ రాజధాని లిమా లోని జార్జ్ చావెజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.