ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు పీకే. తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్వీట్ చేశారు. త్వరలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని.. పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని తెలిపారు. పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని.. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పని చేశానని చెప్పారు పీకే. తన సొంత రాష్ట్రం బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టనున్నారు. జన్ సురాజ్ పేరిట…