Prashant Kishor : కొత్త పార్టీతో పీకే సక్సెస్ అవుతారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు పీకే. తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ట్వీట్ చేశారు. త్వరలో కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని.. పూర్తి స్థాయిలో ప్రత్యక్ష రాజకీయాల్లో వస్తున్నానని తెలిపారు. పదేళ్లుగా ప్రజల పక్షాన విధానాలు రూపొందించానని.. అర్థవంతమైన ప్రజాస్వామ్యం కోసం పని చేశానని చెప్పారు పీకే. తన సొంత రాష్ట్రం బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టనున్నారు. జన్ సురాజ్ పేరిట ఆయన రాజకీయ పార్టీ పెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు పలు పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా ఉండి విజయం సాధించిన పీకే.. పార్టీ పెట్టి విజయం సాధిస్తారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇప్పటికే వైసీపీ, టీఎంసీ, డీఎంకే పార్టీలకు వ్యూహకర్తగా వ్యవహరించారు ప్రశాంత్ కిషోర్.
Read Also: Revanth Reddy: కాంగ్రెస్ పరేడ్ గ్రౌండ్ లాంటిది.. ఎవడి ప్రాక్టీస్ వాడిదే…!
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
- October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
- Divya Mittal: ఐఏఎస్‌కు గుడ్‌బై.. రాజకీయాల్లోకి ఎంట్రీ..
రాజకీయ వ్యూహకర్తగా ఉండి రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న పీకే.. గతంలో జేడీయూలో జాయిన్ అయ్యారు. కానీ, అందులో చాలా రోజులు మనుగడ సాగించలేకపోయారు. ఎన్‌ఆర్‌సీ విషయంలో పార్టీ వైఖరితో విభేదించి బహిరంగ ప్రకటన చేయడంతో… పీకేని బహిష్కరించింది జేడీయూ. దీంతో ఆయన రాజకీయ నాయకుడిగా విఫలమయ్యారన్న చర్చ సాగింది. కాగా, మొన్నటి దాకా కాంగ్రెస్‌లో పీకే చేరుతారని సాగిన ప్రచారానికి.. ఆయన ప్రకటనతోనే తెరపడింది. కాంగ్రెస్‌లో చెప్పింది చేయాల్సి వస్తుందనే.. ఆయన ఆ పార్టీలో చేరలేదని గుసగుసలు వినిపించాయి. అలాగే ఒకవేళ కాంగ్రెస్‌లో పీకే చేరినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడితే.. తాను ఎక్కడ టార్గెట్ అవుతానన్న భయంతోనే ఆయన వెనకడుగు వేశారని కూడా చర్చ సాగింది. గతంలోనూ రాజకీయ నాయకుడిగా ఫెయిల్యూర్ అయిన చరిత్రను కొందరు గుర్తు చేశారు కూడా!. అయితే, తాను విఫలమైన దగ్గరనుంచే ప్రయాణం మొదలు పెడతానంటున్నారు పీకే. ఇప్పటికే రాజకీయాల్లోకి వెళ్లి బయటకు వచ్చిన పీకే.. కొత్త పార్టీ పెట్టి సక్సెస్ అవుతారా? లేక విఫలమవుతారా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!