కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో మొహబ్బత్ దీప్ సింగ్ చీమా కూడా ఒకరు. ఉద్యోగం పోవడంతో దీప్ సింగ్ చీమా(36) తన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి తన సొంత రాష్ట్రం పంజాబ్‌కు తిరిగి వచ్చాడు. ధిల్వాన్‌లో తన సొంత ఫుడ్ ట్రక్ 'ది పిజ్జా ఫ్యాక్టరీ'ని స్థాపించడానికి ఇదే మొదటి అడుగు అని కూడా అతనికి తెలియదు.