ఆకాశంలో కార్లు ఎగరడం ఇప్పటివరకు సినిమాల్లోనే చూశాం. కానీ ఇప్పుడు అది నిజంకాబోతోంది. గాల్లో ఎగిరే కార్లు రూపుదిద్దుకుంటున్నాయి. అమెరికాకు చెందిన పివోటల్ (Pivotal) అనే కంపెనీ ఈవీటీఓఎల్ (eVTOL – electric Vertical Take-off and Landing) విమానాల తయారీలో ముందుంది. అమెరికన్ ఏవియేషన్ స్టార్టప్ పివోటల్ ఒక ప్రత్యేకమైన eVTOLను ప్రారంభించింది. ఇది ఒక వ్యక్తి మాత్రమే ప్రయాణించగలిగే అత్యంత తేలికైన, విద్యుత్‌తో నడిచే వైమానిక వాహనం. ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ ఎయిర్‌క్రాఫ్ట్…