Air India: ఎయిరిండియా.. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా శరవేగంతో విస్తరించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఆ విమానాల్లో పనిచేసేందుకు కొత్తవాళ్లను నియమించుకోనుంది. ఈ ఏడాది 4 వేల 200 మందికి పైగా క్యాబిన్ సిబ్బందిని మరియు 9 వందల మంది పైలట్లను అదనంగా తీసుకోనుంది. ఏడాది కిందట టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియా 470 విమానాలను తెప్పించుకునేందుకు బోయింగ్ మరియు ఎయిర్‌బస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.