పోలాండ్ ఎయిర్ షోలో అపశృతి చోటుచేసుకుంది. ఎయిర్ షో రిహార్సల్ చేస్తుండగా ఒక్కసారిగా ఫైటర్ జెట్ కూలిపోయింది. ప్రేక్షకులు చూస్తుండగానే కూలిపోయింది. కిందపడగానే ఒక్కసారి విమానం కూలిపోయింది. పెద్ద ఎత్తున నిప్పులు చెలరేగి ఎఫ్-16 పైలట్ మృతి చెందాడు.
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శిక్షణలో ఉన్న ఐఏఎఫ్ జాగ్వార్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ చనిపోగా.. మరొక పైలట్ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జామ్‌నగర్ నుంచి 12 కి.మీ దూరంలో ఉన్న సువార్త గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే స్థానిక ప్రజలకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదు.
ఫ్రాన్స్‌లో జరిగిన ఎయిర్‌షోలో అపశృతి చోటుచేసుకుంది. 65 ఏళ్ల పైలట్ విమానంతో విన్యాసాలు చేస్తుండగా మధ్యదరా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.