పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రాహ్మణపల్లిలోని తుమ్మల చెరువు సమీపంలో అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై గీతిక స్కూల్ వద్ద చెట్టును కారు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనా స్థలాన్ని పిడుగురాళ్ల పోలీసులు పరిశీలించారు. తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం చేసుకొని కావలి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను శ్రీపొట్టి…