Bengaluru: మహిళపై హింస, అత్యాచారాలకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలను తీసుకువచ్చినా.. మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్టపడటం లేదు. దేశంలో ఎక్కడో చోట అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కామాంధులు బరితెగించి మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. మహిళను బలవంతంగా తీసుకెళ్లి కదిలే కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Kerala Woman physically assaulted in Bengaluru: బెంగళూర్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. యువతి నిస్సాహాయక స్థితిని ఆసరా చేసుకుని బైక్ ట్యాక్సీ డ్రైవర్, అతని మరో సహచరుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. విడతల వారీగా ఇద్దరు యువకులు, యువతిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన బెంగళూర్ నగరంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో పాటు పశ్చిమబెంగాల్ కు చెందిన…