పెట్రో ధరలు దేశవ్యాప్తంగా సామాన్యులకు భారంగా మారిపోయాయి.. క్రమంగా ఆ ధరల ప్రభావం అన్ని వస్తువులపై పడుతూనే ఉంది.. అయితే, పెట్రోల్, డీజిల్‌లపై దిగుమతి సుంకాలను తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే సమయంలో.. ఏడేళ్ల క్రితం అధికారంలో ఉన్న యూపీఏ సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలను కృత్రిమంగా తగ్గించేందుకు కేంద్ర చమురు సంస్థలకు కాంగ్రెస్ పాలిత యూపీఏ ప్రభుత్వం బాండ్లను…