శ్రీలంకలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో గత కొన్ని నెలల నుంచి ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా గురువారం శ్రీలంకలో మరోసారి టెన్షన్ నెలకొంది. అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థి సంఘాలు రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు ఇంటి ముందు పెద్ద ఎత్తున నిరసన నిర్వహిస్తున్నారు. గోటబయ వెంటనే రాజీనామా…