తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి రెంట్ (అద్దె) విధానం, పర్సంటేజ్ (షేరింగ్) విధానంపై ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతూ వెళ్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ప్రస్తుతం రెంటల్ విధానంపై ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ విధానంలో నిర్మాతలు థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించి సినిమాలను ప్రదర్శిస్తారు. అయితే, కలెక్షన్లు తక్కువగా ఉన్నప్పుడు థియేటర్లు షోలను రద్దు చేయడం లేదా మూసివేయడం వంటి…