1996లో వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ ‘పెళ్ళిసందడి’. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో పెద్ద మ్యూజికల్ హిట్. పాతికేళ్ళ తర్వాత అదే పేరుతో రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది ‘పెళ్ళి సందD’. ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో కాగా కన్నడ భామ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ‘పెళ్ళి సందD’ శుక్రవారం దసరా కానుకగా విడుదలైంది. వశిష్ట (రోషన్…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల అధికారిక ఫలితాల కోసం ఆదివారం రాత్రి రెండు తెలుగు రాష్ట్రాలలోని జనం టీవీలకు అతుక్కుపోయిన సమయంలో ఊహించని విధంగా బ్రేకింగ్ న్యూస్ రావడం మొదలైంది. ‘మా’ ఎన్నికల ఫలితాలపై చిరంజీవి స్పందించారన్నది దాని సారాంశం. ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఓ పక్క జరుగుతున్న సమయంలోనే ‘పెళ్ళిసందడి’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అప్పటికే ‘మా’ ఫలితాల సరళి చిరంజీవికి చేరడం జరిగింది. దాంతో ఆ వేదిక మీదనే ఆయన…