ఈటల రాజేందర్ ఈ నెల 14న బిజేపి తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ మారినప్పటి నుంచి.. ఈటలపై టీఆర్ఎస్ నాయకులు మాటల దాడి చేస్తున్నారు. తాజాగా అటు కాంగ్రెస్ నాయకులు కూడా ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బిజెపి నేత పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజరాబాద్ నియోజకవర్గం లో అభివృద్ధి జరగలేదని… తాను చేసిన అభివృద్ధి కనబడుతుందని తెలిపారు. ఎన్నికలు ఇప్పుడే రావని.. అధిష్టానం ఆదేశాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు.…
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్.. భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.. ఇప్పటికే కేంద్ర నాయకత్వాన్ని కలిసిన ఆయన.. తనకున్న అనుమానాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఈటల.. బీజేపీలోకి టచ్‌లోకి వచ్చాడన్న వార్తలు వచ్చినప్పటి నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరో బీజేపీ నేత పెద్దిరెడ్డి.. అసలు ఈటల వస్తే.. పార్టీలో ప్రకంపణలు తప్పవని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.. ఇక, ఆయనను అప్పడి నుంచి బుజ్జగిస్తూనే ఉంది రాష్ట్ర పార్టీ.. ఇప్పటికే…