పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య పెరుగుతున్న సరిహద్దు వివాదానికి మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొచ్చారు. యుద్ధాలను పరిష్కరించడంలో, శాంతిని స్థాపించడంలో తాను నిపుణుడినని పేర్కొన్నారు. ట్రంప్ మాట్లాడుతూ.. ఇది నేను పరిష్కరించబోయే 8వ యుద్ధం అవుతుంది. ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం గురించి చర్చ జరుగుతోంది.” శాంతిని మధ్యవర్తిత్వం చేయగల తన సామర్థ్యాన్ని నొక్కి చెబుతూ, “నేను యుద్ధాలను పరిష్కరించడంలో నిపుణుడిని, శాంతిని నెలకొల్పడంలో నేను నిపుణుడిని. అలా చేయడం గౌరవంగా భావిస్తున్నాను”…