టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో అంపశయమీద ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరిపోసి, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు అహర్నిషలు కష్టపుడుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించే విధానంతో కాంగ్రెస్ కు కరెక్టు నాయకుడు వచ్చాడని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ వేదికగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరారు. మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో జర్నలిస్టులతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ఉద్ఘాటించారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ కుమ్మకై హుజురాబాద్ లో రాజకీయం చేస్తున్నాయన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి హుజురాబాద్ ఉప ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోవాలని…