తెలుగు చిత్రసీమలో పి.సి.రెడ్డిగా సుప్రసిద్ధులు పందిళ్ళపల్లి చంద్రశేఖర రెడ్డి. ఆయన సినిమా అంటే చాలు అందులో తెలుగు వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపించేది. ముఖ్యంగా పల్లెసీమల పచ్చదనం నడుమ పి.సి.రెడ్డి సినిమాలు నాట్యం చేశాయని చెప్పవచ్చు. వాటిలో కుటుంబకథలే మిన్నగా తెరకెక్కించారు. అందువల్లే పి.సి.రెడ్డి సినిమా అనగానే ఓ చక్కని కుటుంబ కథను చూడవచ్చునని ప్రేక్షకులు సైతం భావించేవారు. సదా నిర్మాత శ్రేయస్సు కాంక్షిస్తూ, తన నిర్మాతకు తన వల్ల ఓ రూపాయి ఆదాయం రావాలనే అభిలాషతోనే పి.సి.రెడ్డి…