Tamil Nadu: మాములుగా నిమ్మకాలకు ఎంత ధర ఉంటుంది..? మహా అయితే రూ. 10కి మించదు. కానీ తమిళనాడులో ఓ ఆలయంలోని నిమ్మకాయ మాత్రం ఏకంగా రూ. 35,000 ధర పలికింది. తమిళనాడులోని ఓ గ్రామంలో ప్రైవేటు ఆలయంలో జరిగిన వేలం పాటులో ఇంత ధర పలకడం చూసి సామాన్యుడు అవాక్కవుతున్నాడు.