FASTag: సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎంకి మరో షాక్ తగలింది. మార్చి 15 లోగా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు ఇతర బ్యాంకులకు మారాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సూచించింది. మార్చి 15, 2024లోపు వేరే బ్యాంకులు జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు పెనాల్టీలు, రెట్టింపు రుసుము చెల్లించకుండా ఈ సూచనను పాటించాలని మార్చి 13న రోడ్డు & రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
Paytm FASTags : రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల ప్రకారం Paytm పేమెంట్స్ బ్యాంక్ వివిధ సేవలను మూసివేయడానికి గడువు సమీపిస్తోంది. Paytm పేమెంట్స్ బ్యాంక్ అనేక సేవలు ఇప్పటికే ప్రభావితమయ్యాయి.