అమరావతి ఆర్థిక పురోగతికి పునాది పడిన రోజు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఇదొక బృహత్తర కార్యక్రమం అని పేర్కొన్నారు. రాష్ట్ర పురోగతి కోసం ప్రతి అడుగు అభివృద్ధికి ప్రధాని మోడీ అందిస్తున్న సహాయ సహకారాలు మర్చిపోలేనిదన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సహాయం కాగితాల్లో కరిగిపోకుండా.. జవాబుదారితనం, మంచి సారథ్యంతో ముందుకు వెళ్తున్నామన్నారు. అమరావతి ఆర్థిక కేంద్రంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. అమరావతిలో…