తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పై జనసేనాని పవన్కళ్యాణ్ అభినందనల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన తీసుకుంటున్న చర్యలు అందరికీ ఆదర్శప్రాయంగా మారాయి. ఇటీవల కాలంలో ఆయన చేసిన కామెంట్స్ లో అసెంబ్లీలో ఎవరికైనా పొగిడే ఉద్దేశం ఉంటే మానుకోవాలని, అలాంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే బ్యాగుల పై రాజకీయ ప్రత్యర్థుల ఫోటోలు ఉండగా, అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. బ్యాగులపై ఫోటోలు మార్చడానికి చాలా ఖర్చు అవుతుందని,…