నటరత్న యన్.టి.రామారావు,అంజలీదేవి నటించిన అనేక చిత్రాలు విశేషాదరణ చూరగొన్నాయి. పౌరాణిక, జానపద, చారిత్రకాల్లోనే కాదు సాంఘికాల్లోనూ యన్టీఆర్ – అంజలీదేవి జంట భలేగా ఆకట్టుకుంది. అలా అలరించిన ఓ చిత్రం ‘పరువు-ప్రతిష్ఠ’. వాల్టా ప్రొడక్షన్స్ పతాకంపై జూపూడి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రానికి మానాపురం అప్పారావు దర్శకత్వం వహించారు. 1963 మే 9న విడుదలైన ‘పరువు-ప్రతిష్ఠ’ మంచి ఆదరణ చూరగొంది. ఈ సినిమాకు ముందు యన్టీఆర్, అంజలీదేవి నటించిన ‘లవకుశ’ మహత్తర పౌరాణిక చిత్రంగా అనూహ్య విజయం…