పరుచూరి బ్రదర్స్… కొన్ని దశబ్దాల పాటు తెలుగు సినిమా రంగాన్ని ఏలారు. ఏజీ ఆఫీస్ లో ఉద్యోగం చేస్తూ, సినిమాలకు రచన చేసేవారు అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు. ఉయ్యూరు కాలేజీలో తెలుగు లెక్చరర్ గా పనిచేస్తూ అన్నయ్యకు అప్పుడప్పుడూ రచనల్లో సాయం అందించేవాడు చిన్నవాడు గోపాలకృష్ణ. వీరిద్దరికీ ‘పరుచూరి బ్రదర్స్’గా నామకరణం చేసి ఆశీర్వదించిన ఘనత నందమూరి తారక రామారావుది. అప్పటి నుండి కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినిమా రంగంలో రచయితలుగా చక్రం తిప్పారు ఈ అన్నదమ్ములు.…