Robo Shankar: కోలీవుడ్ స్టార్ కమెడియన్ రోబో శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు లేని స్టార్ హీరో సినిమా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రోబో శంకర్ ప్రస్తుతం పార్ట్నర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆది పినిశెట్టి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ దామోదరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.