తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ తెలిపారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాల్ని కింది స్థాయి వరకు తీసుకెళ్ళేందుకు ఈరోజు మీటింగ్ లో చర్చించామన్నారు. పార్లమెంట్ నియోజక వర్గాల్లో ముఖ్య నేతల పర్యటన ఉంటుందని ఆమే పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఫిబ్రవరి 5 నుండి 8 వరకు పల్లెకు పోదాం కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు తమకు కేటాయించిన గ్రామంలో 24 గంటలు ఉంటారు.. అక్కడ ప్రజలతో మమేకం అవుతారని…