Chess Championship: ఇటలీ వేదికగా జరుగుతున్న ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు అమ్మాయికి చేదు అనుభవం ఎదురైంది. ఈ టోర్నీలో ఆడుతున్న విజయవాడ గ్రాండ్‌మాస్టర్ నూతక్కి ప్రియాంక టోర్నీ నుంచి బహిష్కరణకు గురైంది. ఈ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన ఆరో రౌండ్‌కు ప్రియాంక పొరపాటున తన జేబులో మొబైల్ ఇయర్ బడ్స్‌తో వచ్చింది. చెకింగ్‌లో ఆమె జాకెట్‌లో ఇయర్ బడ్స్ బయటపడటంతో ఆటను రద్దు చేసి ప్రత్యర్థిని విజేతగా ప్రకటించారు. ఫౌల్ గేమ్ ఆడనప్పటికీ…