14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి ముగియడంతో వివిధ పంచాయతీలకు పాత నిధులు ఇవ్వలేం అంటూ కేంద్రం స్పష్టం చేసింది. రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ జవాబులిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బకాయిపడిన 529.96 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయలేమని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపినట్లు పంచాయితీ రాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ వెల్లడించారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి…
ఏపీలో ఎన్నికలు జరగని పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల పర్వంలో టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల ఉపసంహరణ ప్రక్రియలో 8వ వార్డు ఉపసంహరణ విషయంలో మొదటినుండి హై డ్రామా నడిచింది. 8వ వార్డు టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించు కున్నాడని వైసీపీ అభ్యర్థి ఒక్కరే బరిలో ఉండటంతో ఏకగ్రీవంగా ప్రకటించారు. 8వవార్డులో తండ్రి కొడుకులు ఇద్దరూ టీడీపీ తరుపున పోటీ చేశారు. ఉపసంహరణలో…