శ్రీరామనవమి పండుగ గురించి అందరికీ తెలుసు.. హిందువులు ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని దేవుడికి సమర్పిస్తారు.. అలాగే శ్రీరామనవమికి కూడా రాముడికి ఎంతో ఇష్టమైన పానకంను నైవేద్యంగా స్వామికి సమర్పిస్తారు.. ఉగాదికి షడ్రుచుల పచ్చడిని ఎలా అయితే స్వీకరిస్తామో.. ఆ తర్వాత వచ్చే శ్రీరామనవమి రోజున రాములోరి కల్యాణం అనంతరం భక్తులకు వడపప్పు, పానకాన్ని ప్రసాదంగా పెడతారు.. ఉగాది నుంచి చలి పూర్తిగా తగ్గిపోయి వేడి రోజురోజుకు పెరుగుతుంది. అందుకే శ్రీరామనవిమికి తాటాకు పందిళ్ళు వేస్తారు..…