Palamuru Rangareddy Lift Irrigation Project: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నారు.. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ ఈఎన్సీ… పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు డీపీఆర్ ఇవ్వాలని లేఖలో కేఆర్ఎంబీని కోరింది… విభజన చట్టానికి వ్యతిరేకంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానం జరుగుతోందని ఆక్షేపించింది.. కృష్ణా బేసిన్‌లో తెలంగాణ…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) బ్రేక్ వేసింది.. ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది… పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు పనులు చేపట్టవద్దని స్పష్టం చేసింది.. కాగా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని కరివెన వద్ద నిర్మిస్తున్నారు. దీనికి 2015, జూన్ 11న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. జూరాల ప్రాజెక్టు వద్ద కృష్ణానది…
కృష్ణా జలాల విషయం ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది… ఇక, నీటి వివాదంపై ఇవాళ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. కృష్ణా జలాలపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన.. ఏపీతోనే కాదు.. దేవుడితో కొట్లాడతాం.. చట్టప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకుంటాం అన్నారు.. కేసీఆర్ నాయకత్వంలో ఏపీతోనే కాదు అవసరమైతే దేవుడితో కూడా కొట్లాడతామని.. ఎవరెన్ని రకాలుగా అడ్డుకున్నా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేస్తామని ప్రకటించారు..…