Shehbaz Sharif: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారత్-రష్యా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-రష్యా సంబంధాలను తాము గౌరవిస్తున్నామని చెప్పారు. చైనాలో జరిగిన ఎస్‌సీఓ సమావేశానికి హాజరైన షరీఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. మాస్కోకు న్యూఢిల్లీతో ఉన్న సంబంధాలను ఇస్లామాబాద్ గౌరవిస్తుంది, అవి చాలా బాగున్నాయని మంగళవారం షరీఫ్ అన్నారు.