Pakistani : పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా, భారత్‌లో ఉన్న పాక్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నిబంధనల మేరకు అన్ని రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలోనూ పోలీసు అధికారులు…
హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్‌లో ఉన్నారన్నారు. వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని.. స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.