యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2015 టాపర్‌గా నిలిచి సెకండ్ ర్యాంకర్‌ను వివాహమాడి.. రెండేళ్లకే విడాకులు తీసుకున్న ఐఏఎస్ అధికారి టీనా దాబి.. గతేడాది మళ్లీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం జైసల్మేర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తోన్న టీనా దాబి.. వివాదాస్పద నిర్ణయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు.