Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతల్ని మరింత పెంచుతూ పాక్ కవ్వింపులకు దిగుతోంది. ఇప్పటికే, గత 9 రోజులుగా ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ‘‘బాలిస్టిక్ మిస్సైల్’’ని విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించింది.