Anup Rubens : నవతరం సంగీత దర్శకుల్లో అనూప్ రూబెన్స్ తీరే వేరుగా సాగుతోంది. తనదైన బాణీలు పలికిస్తూ మురిపిస్తున్న అనూప్, అనువైన చోట నేపథ్య సంగీతం మాత్రమే సమకూరుస్తున్నారు.
ఏప్రిల్ 18న అనూప్ రూబెన్స పుట్టిన రోజు సంగీతం పరబ్రహ్మ స్వరూపం! అది ఎవరిని ఎప్పుడు కరుణిస్తుందో చెప్పలేం. అనూప్ రూబెన్స్ ను ఆ సంగీతలక్ష్మి కటాక్షించింది. పిన్నవయసులోనే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని, ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ తెలుగు సినిమా సంగీతప్రపంచంలో సాగుతున్నారు అనూప్. అనూప్ రూబెన్స్ అసలు పేరు ఈనోక్ రూబెన్స్ . 1980 ఏప్రిల్ 18న అనూప్ జన్మించారు. చిన్నతనంలోనే గిటార్, డ్రమ్స్ ప్లే చేస్తూ సాగారు. ఏదైనా ఉత్సవాల్లోనూ, చర్చిలోనూ…