కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) మండలం వెంకట్రావుపేట గ్రామంలో సోమవారం రాత్రి సాయిబాలాజీ ఆగ్రో రైస్ మిల్లులో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి 69,394 బస్తాల వరి ధాన్యం స్వాహా చేసినట్లు గుర్తించారు. ఆ ధాన్యం విలువ రూ.5.90 కోట్లుగా అంచనా వేశారు. 2022-2023 రబీ సీజన్‌లో 38,265 బస్తాలకు గాను 2,174 బస్తాలను మిల్లింగ్‌కు కేటాయించగా, 42,301 బస్తాలకు 42,302 బస్తాలకు గాను కేవలం 122 బస్తాలు ఇచ్చామని విజిలెన్స్ జిల్లా…