Accident : మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అతి వేగంతో దూసుకొచ్చిన ఇన్నోవా కారు ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని బలిగొంది. శంషాబాద్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్తున్న ఓ ఇన్నోవా కారు, మైలార్‌దేవ్‌పల్లి వద్ద నియంత్రణ కోల్పోయి బీభత్సం సృష్టించింది. ఓవర్ స్పీడ్ కారణంగా కారు అదుపుతప్పి నేరుగా ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన దుప్పట్లు, రగ్గులు విక్రయించుకుంటూ అక్కడే నిద్రిస్తున్న ఓ…