Vadapalli: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో టికెట్ కౌంటర్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న రామవరపు రుషేంద్ర భక్తులను మోసం చేస్తూ.. నగదు దోపిడీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.