నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా రెండో భాగం రూపొందుతోంది. ‘అఖండ’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రెండో భాగం మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్‌లో సింహభాగం పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్ వర్క్ జరుగుతోంది. ‘అఖండ’ సూపర్ హిట్ కావడం, ఈ కాంబినేషన్ మీద భారీ అంచనాలు ఉండడంతో ఈ సినిమాను దక్కించుకునేందుకు ఓటిటి సంస్థలు పోటీపడుతున్నాయి. Also Read:…