ఇటీవల సైబర్ నేరగాళ్ళు కొత్త పద్ధతులను ఫాలో అవుతూ మోసాలను చేస్తున్నారు. ఆన్ లైన్ లింక్ లను పెడుతూ అకౌంట్ ను ఖాళీ చేస్తున్నారు కొందరు.. అలాగే మరికొందరు మాత్రం ఓటీపీ పేరుతో మోసాలకు పాల్పడుతూ జనాలను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి వాటిపై దృష్టి పెట్టింది.. ఓటీపి మోసాలకు చెక్ పెడుతూ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.. ఈ టెక్నాలజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. నేరగాళ్లు ఓటిపి పొందడానికి స్నేహితులుగా నటిస్తూ ఆన్లైన్ మోసాలకి పాల్పడుతున్నారు…